2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్ కు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులతో మాట్లాడి వారితో ఫీజు చెల్లించేలా చూడాలని మెప్మా సీఓలు, ఆర్పీలకు అధికారులు సూచించారు. గురువారం ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో మెప్మా సీఓలు, ఆర్పీలతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ వసుంధర సమావేశం నిర్వహించారు. ఆర్పీలు దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.