

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి (VIDEO)
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. రెండ్రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.