బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణ, జడ్పీ సెంటర్ నందు టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ మార్గదర్శనాని అనుసరిస్తూ దేశ ప్రజల హక్కులను కాపాడటానికి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.