మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. ఈ విషయాన్ని రైతాంగం గుర్తించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. AIUKS ప్రథమ సభ ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేలా కేంద్రప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.