ఖమ్మం: జిల్లా విశిష్టతను గవర్నర్ కు వివరించిన కలెక్టర్

81చూసినవారు
ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా విశిష్టతను గవర్నర్ కు వివరించారు. జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాల చరిత్ర, పర్యటక ప్రదేశాలు, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్