విద్యార్థినులు జీవితంలో ఉన్నత స్థానానికి చేరడమే లక్ష్యంగా పెట్టుకుని అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే సాధించడం కష్టమేమీ కాదని కలెక్టర్ ముజమ్మిలాఖాన్ తెలిపారు. ఖమ్మంలోని మహిళా ప్రాంగణం విద్యార్థినులు ఎంపీహెచ్ డబ్ల్యూ ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిభ కనబర్చగా కలెక్టర్ మంగళవారం అభినందించారు. ఈ కోర్సు ఆధారంగా ఏ రంగాల్లో ఎదగవచ్చో అవగాహన పెంచుకోవాలని సూచించారు.