అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబురాలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలనేవి ప్రభుత్వ సంకల్పమని పువ్వాళ్ల పేర్కొన్నారు.