
అంబేేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చంద్రబాబు
AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని సీఎం చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజలు విద్యావంతులై ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేడ్కర్ అన్నారని స్మరించుకున్నారు. అంబేడ్కర్ కలలు కన్న సమ సమాజాన్ని సాధించుకుందామన్నారు. దళిత అభ్యుదయానికి అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు.