పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.. 31 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూలై 7న ప్రతి మాదిగ పల్లెలలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేయలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ ఛార్జ్ కంచికోట్ల విజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గొల్లమందల ముత్తారం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.