తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గత ప్రభుత్వం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసామని, రాబోయే రోజులలో, మరికొన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వరి ధాన్యానికి 500 బోనస్ వంటి అనేక హామీలు నెరవేర్చామని తెలిపారు.