జీవితంలో విద్యార్థులు ప్రణాళికతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యం సాధించడంలో విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ కింద కూర్చొని మాట్లాడారు. పరీక్షలపై భయం తగ్గాలంటే ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.