ఖమ్మం: నేడు ఏరువాక పౌర్ణమి

57చూసినవారు
ఖమ్మం: నేడు ఏరువాక పౌర్ణమి
రైతుల పండుగ అయిన ఏరువాకను బుధవారం జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. వర్ష రుతువులో జేష్టశుద్ధ పూర్ణిమను అన్నదాతలు ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే తొలకరి జల్లులు కురిసినందున రైతులు అరక దున్నుతూ సాగుపనులను ప్రారంభిస్తారు. కాడెద్దులను కడిగి పసుపుకుంకుమ చల్లి అలంకరించడమే కాక పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. పలువురు ఎద్దులకు బదులు ట్రాక్టర్లను అలంకరించి పొలానికి వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్