వచ్చేనెల 6వ తేదీ నుంచి మొదలుకానున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు సంబంధించి సూపర్వైజర్లకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు. కేఎంసీ పరిధిలో 25 బృందాలను ఏర్పాటు చేయగా, ఒక్కో ఎన్యుమరేటర్ 170 గృహాల్లో సర్వే చేయాల్సి ఉంటుంది. వీరిపైన సూపర్వైజర్లను నియమించారు. ఈమేరకు 11 పేజీలతో కూడిన ప్రశ్నావళి ఆధారంగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంటుంది.