ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ రెవిన్యూ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మంలో తహశీల్దార్ గా విధులు నిర్వహించే జి. ప్రతాప్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు తహశీల్దార్లు వై. రామారావును జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు, ఏ. పూర్ణ చందర్ రావును మహబూబాద్ జిల్లాకు బదిలీ చేశారు.