ఖమ్మం నగరం 26 వ డివిజన్ రామాలయం వీధిలో మహా కుంభమేళాకు వెళ్లి ఖమ్మం తిరిగి వచ్చిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మార్తి వీరభద్ర ప్రసాద్ విశాలాక్షి ఆధ్వర్యంలో త్రివేణి సంగమ జల వితరణ గురువారం ఉదయం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 144 సంవత్సరాలకు వచ్చే మహా కుంభమేళాకు వెళ్లి రావడం ఎంతో అనుభూతిని కలుగజేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర విష్ణు, మందా సరస్వతి, శ్యామ్, వీరస్వామి, పిల్లలమర్రి వెంకట్ పాల్గొన్నారు.