

నిరసన ముసుగులో యాపిల్ స్టోర్‌లో చోరీ.. వీడియో వైరల్
అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులపై లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇదే అదునుగా చేసుకొని ముసుగులు ధరించిన కొందరు దుండగులు డౌన్‌టౌన్ ప్రాంతంలో యాపిల్ స్టోర్ సహా పలు వ్యాపార కేంద్రాల్లోకి చొరబడ్డారు. అద్దాలు పగులగొట్టి గ్యాడ్జెట్లు చోరీ చేశారు. మరికొన్ని దుకాణాల్లోనూ భారీగా విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.