ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం శానిటేషన్ సిబ్బందికి యూనిఫాంలు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చేతుల మీదుగా మహిళా సిబ్బందికి చీరలు, పురుషులకు ప్యాంట్-షర్టులు అందజేశారు. అదనంగా శానిటేషన్ సిబ్బందికి కోకోనట్ ఆయిల్ బాటిల్స్, సబ్బులు వంటి అవసరమైన వస్తువులు కూడా అందజేశారు. పట్టణ అభివృద్దిలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు.