పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. మొక్కల ప్రేమికుడైన ఆయన.. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. ఆయన కోటికి పైగా మొక్కలు నాటారు.