ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య మరణం ధరిత్రికి తీరని లోటని అన్నారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని గుర్తు చేశారు. వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.