ఖమ్మం నగరం బైపాస్ రోడ్ N. S. P క్యాంప్ దగ్గర గల శ్రీ సీతారామాంజనేయ స్వామి శ్రీ రామగిరి) దేవస్థానమందు శ్రీ గాయత్రి సేవాసమితి ఖమ్మం వారిచే శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బుధవారం నుండి ఆదివారం వరకు 24 వ తెలంగాణ వేదవిద్వన్మహాసభలు ఘనంగా జరగతున్నాయి. ఈ వేదసభలలో సుమారు 500 మంది విద్యార్థులకు 50 మంది వేద అధ్యాపకుల, పరీక్షాధికారులచే ఒకే వేదికపై పరీక్షలు నిర్వహించి ప్రశంసాపత్రము, జయపత్రిక ప్రదానం చేస్తారు.