ఖమ్మం నగరం బ్రాహ్మణ బజారులో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబికా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8-00 లకు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది దేశానికి మనకు జరుగుతున్న యుద్ధంలో మనదేశం పరిపూర్ణ విజయం సాధించాలని కోరుతూ వేద పండితులు వేద పారాయణ చేశారు. ఖమ్మం పట్టణ పురోహిత సంఘ అధ్యక్షుడు మార్తి వీరభద్ర ప్రసాద్ శర్మ, సొలసా దుర్గా ప్రసాద్ శర్మ పాల్గొన్నారు.