ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఘనంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగింది. ఈ సందర్భంగా భక్త మహిళా మండలి సభ్యులు గండికోట వెంకటలక్ష్మి, జక్కేపల్లి ఉషశ్రీ పాల్గొని మహిళల చేత విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చేయించారు.
ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.