ఖమ్మంలోని 57వ డివిజన్ పరిధిలో గల సర్వే నంబర్ 64లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు కాపాడాలని డివిజన్ కు చెందిన ప్రజలు గురువారం కోరారు. ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాల, దేవాలయం నిర్మాణం చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని, ఆక్రమణకు గురైతే సహించేది లేదన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే పోరాటాలు చేయాల్సి వస్తుందని తెలిపారు.