రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చేనెల 1 నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొని ప్రజలకు పథకాలను వివరించాలన్నారు.