భర్త వేధింపులతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. ఖమ్మం నగరంలోని జాస్మిన్కు శివపురికాలనీకి చెందిన రాజశేఖర్ తో వివాహం జరగింది. పెళ్లి అయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరగగా, 3నెలల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది. మంగళవారం రాజశేఖర్ ఇంటికి వచ్చి చూసేసరికి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.