ఖమ్మం నగరంలోని రామన్నపేట, దంసాలపురం, కాల్వవొడ్డు, బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్ ముంపు ప్రాంతాల్లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం పర్యటించారు. అందరికీ భోజన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో కలిసి అక్కడే కమిషనర్, ట్రైనీ కలెక్టర్ భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. వాటర్ సప్లై, నిత్యవసర సరుకులు పంపిణీ, ఇంటింటి సర్వేలపై ఆరా తీశారు.