భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తల్లాడ మండల తహశీల్దార్ భాస్కరరావు అన్నారు. కొడవటిమెట్ట గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన, రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల రెవెన్యూ అధికారులు రైతులు పాల్గొన్నారు.