కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ గణితం, బీఎల్ఐసీతో పాటు పీజీలో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా. గోపి తెలిపారు. ఈనెల 25వ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.