కార్మిక చట్టాలను పటిష్టంగా చేసి వారికి కనీస వేతనాన్ని ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడకుండా తమ పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయకుంటే ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్తారని పేర్కోన్నారు.