ఖమ్మం నగరంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంలో పాల్గొని ప్రసంగించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి వి. సుబ్బారావు. హెచ్. డి. ఎఫ్. సి బ్యాంక్ సహకారంతో ఎన్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పర్యవేక్షణలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులతో రక్తదాన ప్రతిజ్ఞ నిర్వహించడంతో పాటు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.