చేతన బృందానికి మంత్రి అభినందనలు

51చూసినవారు
చేతన బృందానికి మంత్రి అభినందనలు
ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధితులకు చేతన ఫౌండేషన్ ద్వారా అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్ రేణుక దంపతుల ఆధ్వర్యాన సభ్యులు శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె వరదల సమయాన బాధితులకు చేసిన సేవలను అభినందించి, భవిష్యత్లోనూ సేవలందించాలని సూచించారు. వలంటీర్లు సురేశ్, నవీన్, రషీద్, సత్తులాల్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్