మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై విసృతంగా పర్యటించారు. పలు డివిజన్ తో పాటు మార్కెట్ ఏరియా, ప్రకాష్ నగర్ ప్రాంతాల ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దంసలాపురం ఎగ్జిట్ పాయింట్ వద్ద ఎగ్జిట్ పనులను పరిశీలించి త్రీ టౌన్ ప్రాంతానికి కలిపే రోడ్డును డబుల్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని సూచించారు.