ఎన్సీసీ కేడెట్లు సామాజిక సేవలో పాల్గొనాలి: సీపీ

57చూసినవారు
ఎన్సీసీ కేడెట్లు సామాజిక సేవలో పాల్గొనాలి: సీపీ
ఎస్సీసీ కేడెట్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పోలీస్ కమీషనర్ సునీల్ దత్ సూచించారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 11వ బెటాలియన్ ఆధ్వర్యాన ఈనెల 19న మొదలైన వార్షిక శిక్షణ శిబిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన 598 మంది కేడెట్లు పాల్గొనగా శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అలవడడానికి ఎన్సీసీ దోహదం చేస్తుందని తెలిపారు.