ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ సేవలు

56చూసినవారు
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ సేవలు
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇకపై ఫోన్ పే, గూగుల్ ఫే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ సరిరామ్ నాయక్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్