కామేపల్లి మండలం ఊట్కూరు గ్రామపంచాయతీ నుండి ముత్యాలమ్మ గుడి వరకు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనది. రోడ్డుకు ఇరువైపులా చెట్టు కొమ్మలు పెరిగి, రహదారిని మింగేసినాయి. పాత గ్రామపంచాయతీ బజారు వీధిలైట్లు రావడం లేదు. గ్రామ ప్రజలు వేసవి కాలంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని పంచాయతీ సెక్రెటరీకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా గాని సమస్య తీరడం లేదు. అధికారులు సకాలంలో స్పందించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.