హైదరాబాద్ మాదిరి ఖమ్మంకు ఓఆర్ఆర్: మంత్రి

69చూసినవారు
హైదరాబాద్ మాదిరి ఖమ్మంకు ఓఆర్ఆర్: మంత్రి
హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నట్లే ఖమ్మం నగరం చుట్టూ ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అనుసంధానం చేస్తూ అనేక జాతీయ రహదారులకు గతంలోనే ప్రతిపాదనలు పంపించగా, కొన్నింటికి నిధులు మంజూరు కావడమే కాక పనులు మొదలయ్యాయని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి రూ. 654. 86కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్