జాస్తిపల్లిలో వైభవంగా పీర్ల పండుగ

6చూసినవారు
కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామంలో పీర్ల పండుగను ఆదివారం ఘనంగా ని ర్వహించారు. కొట్టం వద్ద పీర్లను ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడారు. దట్టీలు, కుడకలు, బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానికులు, ముస్లింలు, గ్రామస్తులు ఎర్రబోయిన కృష్ణ య్య, రాయల వీరన్న తదితరులు పాల్గొ న్నారు.