పవిత్ర తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదంపై నామ్ తమిళర్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా శనివారం ఖండించారు. ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు వేంకటేశ్వరస్వామి భక్తులకు ఉన్న గొప్ప విశ్వాసాలపై అవగాహన, గౌరవం లేకపోవడాన్ని చూపుతున్నాయని తెలిపారు. తిరుమల లడ్డూ నమ్మకం, భక్తికి ప్రతీక, దాని పవిత్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.