ఎండు గంజాయి స్వాధీనం

63చూసినవారు
ఎండు గంజాయి స్వాధీనం
ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని శాంతినగర్, చెరువు బజార్, పాకబండ బజార్తో పాటు జిల్లాలోని మైలవరానికి చెందిన ఆ ఏడుగురు ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గంజాయిని ఖమ్మంలో విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయి, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్