ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 11 కేవీ సహకారనగర్ లైన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ బి. తావుర్యా తెలిపారు. దీంతో సహకారనగర్, బోడేపూడి స్తూపం, వీడీఓస్ కాలనీ, గట్టయ్యసెంటర్, మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రాంతం, కృషి భవన్ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.