ధరణి దరఖాస్తులను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన జిల్లాల అధికారులతో ధరణి దరఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 15 నుంచి 28 వరకు పరిష్కరించిన దరఖాస్తులపై ఆరా తీయడంతో పాటు మిగతా వాటిపై సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారించాక ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.