జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే కాక ప్రకృతి విపత్తు బాధితులకు సాయం కూడా అందిస్తామని ఖమ్మం జడ్జి జి. రాజగోపాల్ తెలిపారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యాన ఖమ్మం సేవా సదన్ లో 200 మంది వరద బాధితులకు నిత్యావసర సామగ్రి, దుస్తులు అందజేశారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన సేకరించిన సామగ్రి కలిపి రూ. 1, 700 విలువైన సామగ్రిని 200మందికి అందించామని తెలిపారు.