ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ లో మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.