అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఇసుకను ఈనెల 8న వేలం వేయనున్నట్లు రఘునాథపాలెం మండల తహశీల్దార్ విల్సన్ బెన్నీ తెలిపారు. మైనింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్న 57. 5 మెట్రిక్ టన్నుల ఇసుక వేలంలో పాల్గొనే వారు 8న ఉదయం 11 గంటలకల్లా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.