ఖమ్మం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున నుండి చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
గురువారం రాత్రి నుండి ప్రారంభమైన వర్షం కొద్దిపాటి చిరుజల్లులతో కురిసినా శుక్రవారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది.గత నాలుగు రోజులుగా పగలు ఎండలతో రాత్రిపూట ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చాలా ఉపశమనం కలిగించింది.