ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 1, 207 పాఠశాలలకు గాను రూ. 1, 52, 17, 500 విడుదలయ్యాయని డీఈఓ సోమశేఖర శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులు ఒకటి, రెండు రోజుల్లో పాఠశాలల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు.