ఖమ్మం నగరానికి చెందిన కుంచపు రాంబాబు రూ. 2లక్షల చెక్కును వరద బాధితుల సహాయార్ధం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా ఎక్సైజ్ ఉద్యోగులు రూ. 25వేలను అందించారు. కాగా, విద్యుత్ శాఖ, పంట నష్టంపై అంచనాల రూపకల్పనపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, తదితరుల పాల్గొన్నారు.