ఇటీవల బదిలీ అయిన వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు శుక్రవారం డీఏఓ ఎం. విజయనిర్మల ఉత్తర్వులు అందించి విధుల నుంచి రిలీవ్ చేశారు. ఈనెల 3న ఏఓలు, 5న ఏఈఓలకు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించిన రుణమాఫీ నేపథ్యాన ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రస్తుతం రుణమాఫీ పూర్తికావడంతో 16 ఏఓలు, 49మంది ఏఈఓలకు ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. పైస్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది.