ఖమ్మం అడిషనల్ కలెక్టర్ కు వినతి

68చూసినవారు
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ కు వినతి
సివిల్ సప్లయ్ హమాలీలు, జీసీసీ హమాలీల రేట్ల పెంపుపై జీవోను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ శ్రీజకు ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత సంవత్సరం అక్టోబర్ 3న సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. ఆ చర్చల్లో సివిల్ సప్లయ్ హమాలీల వేతనాలు, జీసీసీ కార్మికుల వేతనాల పెంపుదలపై చర్చించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్