గ్రీవెన్స్ దరఖాస్తులన్నీ పరిష్కరించండి

70చూసినవారు
గ్రీవెన్స్ దరఖాస్తులన్నీ పరిష్కరించండి
గ్రీవెన్స్ డేలో అందుతున్న దరఖాస్తులన్నీ తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ప్రజాపాలన, గ్రీవెన్స్ డే అర్జీలు, ఆర్టీఐ, కోర్టు కేసులపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులపై 3వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. కాగా, వచ్చే సోమవారం నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్